Prasanna Kumar Reddy : జయసుధ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో అవార్డుల గురించి చేసిన కామెంట్స్ బాగానే చర్చకు దారితీసాయి. మాలాంటి వాళ్ళు పద్మ శ్రీ అవార్డులకు పనికిరామా అనడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయింది. ఇక ఈ విషయంలో పై సినిమా ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్పందించారు. అవార్డుల విషయంలో జరిగే రాజకీయాలను ప్రస్తావించారు.

బాలకృష్ణ కు రాకుండా అడ్డుకున్నపుడు నువ్వేం చేసావ్…
అవార్డు నాకు రాలేదని చెప్పడం కరెక్టే మీకు ఆ హక్కు ఉంది, ప్రతిభ ఉండి అవార్డు రాలేదని అడుగుతున్నారు. కానీ మీరు ఎమ్మెల్యే గా ఉండి పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాలకృష్ణ నటించిన శ్రీరామ రాజ్యం సినిమాలో నటనకు బాలకృష్ణ కు నంది అవార్డుకు మొత్తం నంది అవార్డు కమిటీ ఏకభిప్రాయంతో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే రామ రాజ్యం అంటే రాముడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాడు కాబట్టి ఇవ్వకూడదని ఆయన పేరు కొట్టేసి వేరే హీరోకి అవార్డు ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సమయంలో నేషనల్ అవార్డులప్పుడు రామరాజ్యం సినిమాకు ఏ కేటగిరీ లోనూ అవార్డులు ఈకుండా చేసింది. ఆ సినిమాకు కాదు అలా రాముడి మీద కృష్ణుడు మీద తీసిన ఏ సినిమాకు అవార్డు ఇవ్వలేదు ఎందుకంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని వాళ్ళ అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇలా జరిగినపుడు మీరు ఎమ్మెల్యే గా ఉన్నారు కదా మరీ మీరెందుకు మాట్లాడలేదు. మీకు నొప్పి కలిగినపుడు మాత్రమే మాట్లాడుతారా, ఇతరుల విషయంలో మాట్లాడనంటే కుదరదు కదా. ఒక నాయకుడు అంటే అందరి భాద్యతా తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేసారు. అయితే ఈ కామెంట్స్ పై ఇపుడు జయసుధ ఎలా స్పందిస్తారో చూడాలి.



























