Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. కానీ కూతురు చనిపోయి ఇరవై ఏళ్ళు దాటిపోయిన న్యాయం మాత్రం జరగలేదని బాధపడ్డారు.

మొదటి ఆఖరి రెమ్యూనరేషన్ అదే…
ప్రత్యూష సినిమా కెరీర్ మొదలు పెట్టి మొదట కూతురు, చెల్లి పాత్రలు చేసినా ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో సెటిల్ అయ్యే సమయంలో అర్థాంతరంగా కన్నుమూసింది. అయితే కెరీర్ మొదలు పెట్టింది మోహన్ బాబు గారు నటించిన ‘శ్రీరాములయ్య’, ఆ సినిమాలో పనిమనిషి పాత్రలో కనిపించే ప్రత్యూష ఆ పాత్రకు 35,000 రెమ్యూనరేషన్ అందుకుందట. ఇక చివరి సినిమా సరికి హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకున్న ప్రత్యూష 5,00,000 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుందట. సినిమాల్లో నటించేటపుడు రెమ్యూనరేషన్ గురించి ఏనాడూ డిమాండ్ చేయలేదంటూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి వివరించారు.

ఇక చెల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ప్రత్యూష ఆ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకుని కేవలం హీరోయిన్ పాత్రలే చేయాలనుకుంటే కృష్ణ వంశీ గారు ‘సముద్రం’ సినిమా కోసం జగపతి బాబు కి చెల్లి పాత్రలో అడిగారట. మొదట ఒప్పుకోక పోతే హీరోయిన్ కి సమానంగా చూపిస్తాను ఇదొక్క సినిమా చేయండని అడగడంతో ఈ సినిమా తరువాత చేయకూడదని సముద్రంలో నటించిందట. ఇక ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా షూటింగ్ అపుడు నాగార్జున చాలా బాగా చేస్తున్నావ్ నా నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోయిన్ కానీ సన్నబడాలి అని చెప్పారట.



























