Prathyusha : శనివారం రాత్రి బంజారాహిల్స్ లోని తన బోటిక్ లో కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి బలవన్మరణంకి పాల్పడిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఉదంతంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈమె మరణం అనుమానస్పదంగా పోలీసులకు అనిపించినా ఆ తరువాత సుసైడ్ గా నిర్ధారించారు. ఆమె బోటిక్ లో దొరికిన సుసైడ్ నోట్ ఆధారంగా ఆమె సుసైడ్ చేసుకుందని, ఇక మరొకరు ఆమెను చంపి సుసైడ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఆనవాళ్ళు దొరకకపోవడంతో ఆమెది ఆత్మహత్య అని నిర్ధారించారు.

నొప్పి లేకుండా చావడం ఎలా…..
ప్రత్యూష రెండు మూడు నెలల నుండి డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది. మానసిక ఒత్తిడి ఒంటరితనం వల్ల ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక ప్రత్యూష ఉన్న గదిలో డ్రైవ్, సుసైడ్ నోట్ లభ్యం అయ్యాయి. సుసైడ్ నోటులో తల్లిదండ్రులకు భారం కాకూడదని, నాకు నచ్చిన జీవితం ఇది కాదని వివరించింది. ఇక డ్రైవ్ లో ఇంకా వివరంగా సుసైడ్ నోట్ ఉంది. ఇక మొబైల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అంతర్జాలంలో నొప్పి లేకుండా చావడం ఎలా అని ముందే సెర్చ్ చేసినట్లు ఇంటర్నెట్ హిస్టరీ ద్వారా తెలిసింది.

చార్ కోల్ మండించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వాయువును పుట్టించి అది పీల్చి మరణించాలని ముందుగానే అన్ని సిద్ధం చేసుకుంది. గాలి చొరబడని వాష్ రూమ్ ను ఎంచుకుంది. అందుకోసం వారం ముందే వాష్ రూంలోని కిటికీలను క్లోజ్ చేయించింది. అయితే చార్ కోల్ అందుకోసమే కొని పెట్టుకుందా లేక బోటిక్ లో ముందే ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక చనిపోవాలనుకున్న సమయంలో స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. ఇక చనిపోయే ముందు సెల్ఫీ వీడియోను కూడా తీసుకున్నట్లు గుర్తించారు. ఇలా ప్రత్యూష వారం ముందు నుండే చనిపోవడానికి సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది.
































