ప్రేమి విశ్వనాథ్.. బుల్లితెరపై ఈ పేరుకున్న క్రేజే వేరు.. “కార్తీక దీపం” సీరియల్ లో తన అద్భుతమైన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది వంటలక్క. ఒకరకంగా చెప్పాలంటే వంటలక్క స్టార్ హీరోయిన్ల ను పక్కకునెట్టి మరీ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. ఆమె నటిస్తున్నది కేవలం ఒకే ఒక్క సీరియల్ అయినా కూడా వేరే ఎవ్వరూ తనని బీట్ చేయలేని రేంజ్ లో వున్నారు ప్రేమి విశ్వనాథ్.

ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో తన ఫొటోస్, రీల్స్ తో ఫుల్ జోష్ లో వుండే ప్రేమి విశ్వనాథ్. తాజాగా తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక వ్యక్తీ ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు. అదేనండి కార్తీక దీపం సీరియల్ దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

































