Priyadarshini Ram : సాక్షి పేపర్ చదివేవారికి పరిచయం అక్కర్లేని లవ్ డాక్టర్ రామ్ ప్రియదర్శిని. సాక్షి వార్తా పత్రికలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో పనిచేసిన రామ్ ఆ పత్రిక ద్వారా కొత్త పోకడలను పరిచయం చేసారు. అలాగే సాక్షి న్యూస్ ఛానెల్ లో కూడా పనిచేసిన ఆయన అక్కడ న్యూస్ ఛానెల్స్ లో కొత్త ట్రెండ్స్ ను పరిచయం చేసారు. రామ్ పూర్తి పేరు పత్తి లక్ష్మి రామిరెడ్డి కాగా ప్రియదర్శినీ రామ్ అలాగే సాక్షి రామ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఉపేంద్ర హీరోగా టాస్ అనే సినిమాను తీశారు. అలాగే ‘మనోడు’ అనే సినిమాలో హీరోగా కూడా నటించారు. ఇక మరికొన్ని సినిమాల్లో కూడా అతిధి పాత్రల్లో నటించారు. జ్యోతిలక్ష్మి, వినయ విధేయ రామ ఇలా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో వైఎస్ కుటుంబం గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

లేచిపోయి పెళ్లి చేసుకున్నాం…
నా పెళ్లి ప్రేమ వివాహం అంటూ చెప్పారు. ఠాగూర్ శారద చౌహన్ ను మొదటి సారి చూసినపుడే ఇష్టపడ్డానని మా అమ్మను బాగా చూసుకునే అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను అలాంటి అమ్మాయి శారద అనిపించింది, చూడగానే మా అమ్మను బాగా చూసుకుంటావా అని అడిగేసారట లవ్ డాక్టర్. ఇక శారద గారి తండ్రిని మచ్చిక చేసుకోవడానికి పేకాట నేర్చుకుని ఆయనతో ఆడేవాడట. ఆలా స్నేహం పెంచుకుని చివరకు ఒక రోజు నీ కూతురిని పెళ్లి చేసుకుంటా అని అడిగేసాడట.

అయితే ఆయన ఒప్పుకోక పోవడంతో శారదా గారు లైబ్రరీకి అని చెప్పి కాలేజీకి వెళ్లగా రామ్ గారు ఆమెను తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అలాగే గుడిలో పెళ్లి చేసుకున్నారట. ఇక వారి పెళ్ళికి మొత్తం ఏర్పాట్లు చేసి పెళ్లి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారేనంటూ రామ్ చెప్పారు. పెళ్లయ్యాక శారద తండ్రి తుపాకీ తో వచ్చి కాలర్ పట్టుకున్నారట. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు పక్కనే ఉన్నా ఊరికే చూస్తున్నారట. ఆయన ఒక కూతురుకి తండ్రి కాబట్టి కోపం అర్థం చేసుకుని ఆలా ఉండిపోయారని రామ్ ఆ జ్ఞాపకాలని పంచుకున్నారు.

































