Movie News

Priyamani : సమంత అలా చేస్తుందని ఆస్సలు ఊహించలేదు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్!

Priyamani : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరస ప్రాజెక్టులతో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు దూసుకుపోతున్న సమంతా గురించి హీరోయిన్ ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేశారు.సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ప్రియమణి పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చేయడానికి, పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేయడానికి మాత్రమే తీసుకునేవారు. కానీ ప్రస్తుత సినిమాలలో హీరోలకు దీటుగా హీరోయిన్లు నటిస్తున్నారు.ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా హీరోయిన్లు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు అందుకు ఉదాహరణగా సమంత నయనతారల గురించి మాట్లాడారు.

ఇక సమంత విషయానికి వస్తే ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది అని ఇలా సినిమాలో నటించడమే కాకుండా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సమంత ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారని తెలిపారు. ఈ పాటలో సమంత చాలా హాట్ గా ఉందని, తను అలా నటిస్తుందని అస్సలు ఊహించలేదని, ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని తన భర్త అభిప్రాయం కూడా అంటూ సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Priyamani : భామా కలాపం..

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత పలు చిత్రాలు వెబ్ సిరీస్ లో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె భామా కలాపం అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదేవిధంగా ప్రియమణి ఒకవైపు వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

9 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

12 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

12 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

12 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

14 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

14 hours ago