టాలీవుడ్ లో ఎన్నెన్నో పెద్ద సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సంస్థ వైజయంతి మూవీస్.. అశ్విని దత్ ఈ బ్యానర్ కి హోల్ అండ్ సోల్ నిర్మాత కాగా గత కొన్ని రోజులుగా ఈ సంస్థ నుంచి భారీ చిత్రాల రాక ఆగిపోయింది. అశ్విని దత్ కి వయసు పెరిగిపోవడంతో ఈ సంస్థను తన కూతురు ప్రియాంక దత్ టేక్ అప్ చేస్తూ చిన్న చితక సినిమాలు చేస్తూ వచ్చింది.. అయితే మహానటి తో ఒక్కసారిగా పోయిన పేరు మొత్తం వచ్చింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పూర్వ వైభవం వచ్చినట్లయియింది..
తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది ప్రియాంక. ప్రస్తుతం ఈ బ్యానర్ పై మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకువెళ్తుంది. తాజగా జాతిరత్నాలు సినిమాలు ప్రొడ్యూస్ చేసి మరో హిట్ కొట్టింది. మరో నాలుగైదు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.. అయితే ప్రియాంక దత్ వెనుకుండి ఆమెను సపోర్ట్ చేస్తూ ఆమె విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం వీరి లవ్ స్టోరీ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
నాగ్ అశ్విన్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తెను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భిన్న నేపధ్యాలు కలిగిన వీరి మధ్య సినిమా మాద్యమంలా పని చేసి ప్రేమకు కారణం అయ్యింది.మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కూతురైన ప్రియాంకా దత్… దర్శకుడుగా నాగ్ అశ్విన్ సక్సెస్ కాకముందే అతన్ని నమ్మింది. అసలు ప్రియాంక, నాగ్ అశ్విన్ ప్రేమ కథ ఎలా మొదలైంది అనేది అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్న.ఓ సంధర్భంలో నాగ్ అశ్విన్ దీనిపై స్పందించారు. ప్రొఫెషనల్ గా ప్రియాంకతో ఎప్పటి నుండో నాగ్ అశ్విన్ కి పరిచయం ఉందట. కొన్ని యాడ్స్ కోసం వీరు కలిసి పనిచేశారట. ఆ పరిచయంతోనే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి నిర్మాతగా ప్రియాంక దత్ వ్యవహరించారట. ఇక వీరి ప్రేమ కథ వ్యవహారానికి వస్తే.. చాలా సింపుల్ గా వీరి ప్రపోజల్ జరిగిందట.ప్రియాంక దత్ కి పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో.. మీకు ఎవరైనా నచ్చితే ఓకె… లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నారట నాగ్ అశ్విన్.చాలా కాలంగా నాగ్ అశ్విన్ తో ట్రావెల్ చేస్తున్న ప్రియాంకకు అతని మంచి తనం గురించి తెలియడంతో ఓకె చెప్పారట.



























