తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రోజురోజుకూ ఆసక్తిని రేపుతోంది. అందులో అడుగుపెట్టిన 19 మందిలో చివరకు 10 మంది మిగిలారు. అందులో జెస్సీ అనారోగ్యం కారణంగా సీక్రెట్ రూంలో ఉన్నారు. ఇక మిగిలిన 9 మందిలో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు 5 గురు నామినేట్ అయ్యారు.

అందులో సిరి, రవి, కాజల్, మానస్ మరియు సన్నీ ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలో ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆ షోలో లేడీ గెటప్ లో బజర్దస్త్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సాయి తేజ. ఆ తర్వాత అతడు ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు.
ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. ఇప్పటికీ హౌస్ లో కొనసాగుతున్నారు. అయితే ఆమెకు తన సపోర్టు ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్ర ముఖి సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ఎవరో తమకు తెలియదని.. కామెంట్స్ చేశారు.
ఆమెను కేవలం టీవీలో మాత్రమే చూస్తున్నామని.. అది కూడా ఆమె సాయిగానే తెలుసు అని చెప్పారు. ఇలా అమ్మాయిగా మారి ట్రాన్స్‌జెండర్ అయ్యారన్న విషయం తెలిదన్నారు. గతంలో తమన్నా బిగ్ బాస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు తమ సపోర్టు ఇచ్చామని.. ఆమె మా కమ్యూనిటీలో భాగంగా ఉన్నారని అందుకే ఇచ్చామన్నారు. కానీ ప్రస్తుతం హౌస్ లో ఉన్న సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ కు తమ సపోర్టు ఉండదని చెప్పేశారు.






























