Producer Adhisheshagiri Rao : మహేష్, నమ్రత పెళ్లి ఎలా జరిగిందంటే….కృష్ణ మరణించినపుడు వచ్చిన వార్తల్లో నిజం లేదు…: నిర్మాత అధిశేషగిరి రావు

0
166

Producer Adhisheshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అధిశేషగిరి రావు గారు అన్న కృష్ణ గారికి తోడుగా ప్రతి విషయంలోనూ ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. పద్మాలయ స్టూడియోస్ కట్టాక ఆ స్టూడియో బాధ్యతలను ఆయనే చూసుకుంటూ కృష్ణ గారి ఓన్ ప్రొడక్షన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. నటనలో కృష్ణ గారు నిర్మాణ రంగంలో అధిశేష గిరి రావు గారు అలాగే ప్రొడక్షన్ లో హనుమంత రావు గారు ఇలా ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలో ఉండేవారు. ఇక కృష్ణ గారి కుటుంబంలో గతేడాది వరుసగా ముగ్గురు మరణించారు. రమేష్ బాబు గారు మరణించిన కొద్ది నెలలకు ఇందిర గారు ఆ తరువాత కృష్ణ గారు మరణించారు. అలా వరుస విషాదాల తరువాత మొదటి సారి ఇంటర్వ్యూ లో మాట్లాడారు అధిశేషగిరి రావు గారు. కృష్ణ మరణం తరువాత జరిగిన సంఘటనలను వివరించారు.

మహేష్ పెళ్లి… కృష్ణ మరణం తరువాత జరిగినవి….

అధిశేష గిరి రావు గారు నిర్మాతగా మహేష్ బాబు హీరోగా నమ్రత హీరోయిన్ గా వంశీ సినిమా తీశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్ కి మాత్రం లైఫ్ పార్టనర్ దొరికింది. అయితే నమ్రతను ప్రేమిస్తున్న విషయం మహేష్ బాబు మొదట ఆయన తల్లి ఇందిర గారికి చెప్పగా ఆమె కృష్ణ గారికి చెప్పి ఒప్పించారట. వారి పెళ్లి విషయంలో నా ప్రమేయం ఏమి లేదని అధిశేషగిరి రావు గారు ఇంటర్వ్యూ తెలిపారు. ఇక కృష్ణ గారి మరణం అపుడు అభిమానుల సందర్శనం కోసం ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం లో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు.

ఈ విషయం గురించి మాట్లాడుతూ పద్మాలయా లో ఉంచాలని ముందే అనుకున్నామని మళ్ళీ ఫిల్మ్ నగర్ కి తరలించడానికి ఆయన శరీరం తట్టుకోలేదని డాక్టర్స్ చెప్పారు అందుకే వద్దనుకున్నాం. ఇక రాత్రి తొమ్మిది వరకే కృష్ణ గారి సందర్శనకు అనుమతి కూడా పోలీసుల నిర్ణయం అంటూ చెప్పారు. ఇక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయాలని కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకున్నాం. ఆయన గుర్తుగా పద్మాలయాలో ఘాట్ నిర్మాణం చేస్తాము అంటూ చెప్పారు అధిశేషగిరి రావు.కృష్ణ గారి వద్ధ ఎవరూ లేరనేది అపద్ధమని రాత్రి ఆయన శవం వద్ధ నా కొడుకు , మేనల్లుడు అక్కడే ఉన్నారంటూ చెప్పారు . నరేష్ గురించి ఆయన వ్యవహారాల గురించి నేను మాట్లాడనని తెలిపారు.