Producer Chittibabu : నందమూరి మోహన్ కృష్ణ తనయుడు తారకరత్న సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరికీ పరిచయమైనా పెద్దగా కెరీర్ లో సక్సెస్ కాలేదు. ఇక విలన్ గా మాత్రం నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక తాత పెట్టిన పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న తొలి అడుగులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. బావ లోకేష్ పాదయాత్రకు హాజరైన తారకరత్న అక్కడే గుండెపోటు రావడంతో 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడి చివరికి శివరాత్రి నాడు మరణించారు. ఇక ఆయన మరణం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తగా ఆయనను కడసారి చూడటానికి తండ్రి మోహనకృష్ణ తల్లి శాంతి తారకరత్న ఇంటికి రాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక వాళ్ళు ఎందుకు అక్కడికి రాలేదు అన్న విషయాలను సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడారు.

ఆ కారణంతోనే తారకరత్న ఇంటికి రాలేదు…
ప్రేమించి పెళ్లి చెసుకున్న తారకరత్న ను మోహన్ కృష్ణ దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక పదేళ్లుగా మాటలు లేకపోయినా బాబాయ్ బాలకృష్ణ మళ్ళీ కుటుంబానికి తారకరత్న ను దగ్గర చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అంతలోనే ఇలా తారకరత్నను మరణం తన కుటుంబానికి దూరం చేసింది. ఇక ఆయన మరణించినపుడు మోహన్ కృష్ణ స్వగృహానికి శవం తీసుకెళ్లాలని మొదట అనుకున్నా తారకరత్న భార్య వైపు వాళ్ళు నిరాకరించడం వల్ల తారకరత్న సొంతంగా కట్టించుకున్న ఇంటికి ఆయన పార్థివ దేహం తీసుకెళ్లారు.

అయితే మొదటి సారి కొడుకు ఇంటికి ఇలా వెళ్ళల్సి రావడం ఇష్టంలేని మోహన్ కృష్ణ దంపతులు అందుకే అక్కడికి రాకుండా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చారని ప్రొడ్యూసర్ చిట్టిబాబు తెలిపారు. బాలకృష్ణ ఒక వేడుక నిర్వహించి మోహన్ కృష్ణ ను కొడుకు తారకరత్న ను కలపాలని భావించి తారకరత్న కట్టించుకున్న ఇంటికి పిలిపించాలని భావిస్తే అంతలోనే ఇలా జరిగిందని చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.
































