Producer Chittibabu : ఏపీ రాజకీయాల మీద ఎవరికి ఎంత ఆసక్తి ఉందో కానీ రామ్ గోపాల్ వర్మకి మాత్రం బాగా ఆసక్తి. తాను రాజకీయాల్లోకి రాడు కానీ నిత్యం రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఏపీ రాజకీయాలే కావాలి. ఇటీవలే చంద్రబాబు నాయుడు టార్గెట్ గా గుంటూరు, కందుకూరు సభలలో జరిగిన ప్రమాదాలకు చంద్రబాబు కారణం అన్నట్లు మాట్లాడి హిట్లర్, ముస్సోలిని తరువాత నువ్వే అంటూ విమర్శించాడు. ఇక నేడు పవన కళ్యాణ్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ కాపుల గౌరవంను కమ్మోళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు అంటూ కుల రాజకీయం చేసేసాడు. ఇక వర్మ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు.

అమ్మయిల పాదాలు, తొడల గురించి మాట్లాడే వాడు వాడికెందుకు రాజకీయాలు…
ఇటీవల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడించారు. ఈ ఇష్యూ మీద వర్మ తన సోషల్ మీడియా ఖాతాద్వారా కాపులను మళ్ళీ కామ్మోళ్లకు తాకట్టు పెట్టావ్ అంటూ రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్ళు అంటూ పోస్ట్ చేసాడు. దీనిపై చిట్టిబాబు మాట్లాడుతూ అన్ని పార్టీల్లోను అన్ని కులాల వాళ్ళు ఉంటారు.

కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు ????????????
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
కేవలం పవన్ కళ్యాణ్ వెనుక కాపులందరు ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. రాజకీయం బాగా తెలిసినోడు ఎవడూ ఆ మాట అనడు. అమ్మాయిల పాదాలు నాకుతూ వారి తొడల గురించి మాట్లాడే వోడ్కా వర్మ చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకొనవసరం లేదు అంటూ మాట్లాడారు. రాజకీయాల గురించి ఏం తెలుసు, కేవలం ఒక నిప్పు రాజేయడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటాడు అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.



































