Producer Chittibabu : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ గారి మీద లైంగిక ఆరోపణలను చేస్తూ ఒక మహిళ వైరల్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ ద్వారా నారాయణ గారి మీద ఆరోపణలను చేసిన ఆ మహిళ ఎవరో కాదు ఆయన తమ్ముడి భార్యే. ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా తన తమ్ముడి భార్యే లైంగిక ఆరోపణలను చేయడం సంచలనం రికేత్తించిన ఈ ఇష్యూ గురించి నిర్మాత, బీజేపీ లీడర్ చిట్టిబాబు మాట్లాడారు.

నారాయణ అలాంటి వాడే…
చిట్టిబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి నారాయణ మీద విమర్శలను చేసారు. ఆయన మరదలు ప్రియ చేసిన ఆరోపణలలో ఎంత నిముందో తెలియదు కానీ మాజీ మంత్రి నారాయణ మాత్రం అవకాశం దొరికినపుడల్లా అమ్మాయిలతో ఉండేవాడనే విమర్శ ఉందని, మంత్రిగా ఉన్న సమయంలో అమరావతి భూముల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ చెప్పారు.

ఇక తన తమ్ముడు భార్య చేస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుతూ ఆమె మానసికంగా సరిగా లేదని ఆమె భర్త చెబుతున్నారు. అయితే నిజం మనకు తెలియదు. అయితే ఆమె నన్ను ఇంత టార్చర్ చేసారు అంటూ నవ్వుకుంటూ చెప్పడం కొంచం విడ్డూరంగా అనిపిస్తుందని చిట్టిబాబు తెలిపారు. ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ చూపాలంటూ ఆమె చెప్పడం చూస్తే కావాలనే టీడీపీ కి జనసేన కు మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది వారి వ్యూహమే అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డారు.
































