Producer Chittibabu: మెగా ఫ్యామిలీలో ఇటీవలే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. ఆనందంలో అభిమానులు మెగా ఫ్యామిలీ ఉండగా అపుడే మరో వార్త బయటికి వచ్చింది. అదే నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతోందని. 2020లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య తో ఘనంగా వివాహం చేసారు. ఇక పెళ్ళై మూడేళ్ళైనా కాలేదు అపుడే విడాకులు తీసుకున్నారు. ఇటీవలే కోర్ట్ వీరికి విడాకులను మంజూరు చేయగా ఈ ఇష్యూ ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూ గురించి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడారు.

మెగా ఫ్యామిలీ బాధలో ఉంటే…
నిహారిక విడాకుల విషయంలో మెగా ఫ్యామిలీ బాధలో ఉందని అది వాళ్ళ కుటుంబ విషయం కావున చర్చించుకోవడం కరెక్ట్ కాదని చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. నిహారిక సినిమాల్లో నటించింది, సెలబ్రిటీ కావడం వల్ల ఈ విషయం ఇంతగా సోషల్ మీడియాలో వస్తోంది. కానీ బయట కూడా ఎంతో మంది ఏవేవో చిన్న చిన్న కారణలకే విడిపోతున్నారు.

కోర్టులో నేడు విడాకులకు సంబంధించిన కేసులు చాలానే ఉన్నయి. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అయితే వాటి గురించి మనం మాట్లాడుకోము. వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మాట్లాడుతాం అంటూ చెప్పారు. పెళ్లయ్యాక ఇద్దరి అభిప్రాయలు కలవనపుడు విడిపోవాలని చాలా మంది నేటి తరం అనుకుంటున్నారు. ఇంట్లో ఏవో గొడవలో లేక అత్త మామలో అసలు విడాకులకు కారణం కాదు అంటూ భార్యభర్తల మధ్య అభిప్రాయాబేధాలు వస్తే విడాకులకు వెళ్లిపోతున్నారు అంటూ చిట్టిబాబు తెలిపారు.


































