టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోనున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. మూడేళ్ళక్రితం అయన మొదటి భార్య అనిత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు మరో సారి పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. తాజగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. నిజామాబాద్ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఆదివారం రాత్రి రెండో పెళ్లి చేసుకోనున్నారు. ఈ మేరకు అయన ఓక నోట్ విడుదల చేసారు.

అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం రాత్రి ఈ పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ “గత కొన్నాళ్లుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు వృత్తిపరమైన ఇబ్బందులు అందరికి తెలిసినవేనంటూ.. అదే విధంగా తన వ్యక్తి గత జీవితం కూడా అంత గొప్పగా లేదన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు దిల్ రాజు. అయితే కొత్త మలుపుతో తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నట్టు ప్రకటించారు.
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2020




























