Producer Mallidi Sathyanarayana Reddy : డిస్ట్రిబ్యూషన్ నుండి నిర్మాతగా ఢీ, బన్నీ, భగీరథ వంటి సినిమాలను నిర్మించిన సత్యనారాయణ రెడ్డి గారు కొడుకును డైరెక్టర్ గా లాంచ్ చేయాలనీ బాగా కష్టపడ్డారు. ఇక అది కుదరక హీరో చేయాలనుకున్నా చివరికి డైరెక్టర్ గా బింబిసార లాంటి మంచి సినిమా తీసి హిట్ కొట్టాడు వశిష్ఠ. ప్రస్తుతం చిరంజీవి గారితో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ఇంటర్వ్యూ లలో సత్యనారాయణ రెడ్డి గారు ఆయన సినిమా జీవితం గురించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఆది సినిమా మొదట అనుకున్నది ఆకాష్ కోసం….
కొన్నిసార్లు అదృష్టం ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. అలానే దురదృష్టం ఇంకొంత మందిని ఎలా పిలుస్తుందో కూడా చెప్పలేం. ఇక్కడ ఎన్టీఆర్, హీరో ఆకాష్ ల విషయంలో ఇదే జరిగింది. ఎన్టీఆర్ కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చి పెట్టి మాస్ ఆడియన్స్ థియేటర్లో సీట్లు చింపి విజిల్స్ పడిన మొదటి సినిమా ఆది అని చెప్పొచ్చు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని ఎన్టీఆర్ తొడగోడితే నందమూరి అభిమానులు పండగ చేసుకున్నారు.
అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా మొదట హీరోగా అనుకున్నది ఎన్టీఆర్ ను కాదనే విషయం తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు తెలిపారు. డైరెక్టర్ వి వి వినాయక్ తో మంచి సన్నిహిత్యం ఉన్న ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. డైరెక్షన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ లో ప్రయత్నాలు చేస్తున్న వినాయక్ కు బెల్లంకొండ గారు అవకాశం ఇవ్వడం ఆయన ఆకాష్ హీరోగా సినిమా చేయాలనీ అనుకుంటే అది అనేక మలుపులు తిరిగి చివరికి ఎన్టీఆర్ హీరోగా ఆది సినిమా అయిందట. అలా ఆకాష్ తెలియకుండానే మంచి అవకాశం కోల్పోగా ఎన్టీఆర్ కు అదృష్టం వరించిందని చెప్పారు.



























