Producer Natti Kumar : వైసీపీ మహిళా నేత మంత్రి రోజా తన నోటి దురుసుతో బాగా ఫేమస్. ప్రత్యర్థులను ఏమాత్రం లెక్కచేయకుండా విమర్శల పేరుతో వ్యక్తిగతంగా బాగా విరుచుకుపడుతుంది మంత్రి రోజా. అయితే ప్రస్తుతం ఆమె చేసిన ఒక పని వల్ల నెటిజన్స్ ట్రోల్స్ కి బాగా గురవుతోంది. అధికారిక పర్యటనలో ఉన్నపుడు పర్యాటక అధికారి చేత చెప్పులు మోపించడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ వివాదంలో రోజా తప్పేంటి అంటూ సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

రోజా చేసినదాంట్లో తప్పేముంది…
నట్టి కుమార్ గారు మాట్లాడుతూ రోజాను విమర్శించడం తప్పు అంటూ అభిప్రాయపడ్డారు. ఒక మహిళకు సాయం చేసాడనే కోణంలో ఎందుకు చూడటం లేదు. ఒక మహిళకు సహాయం చేసాడు అందులో తప్పేముంది అంటూ మాట్లాడారు. పాజిటివ్ గా ఏదైనా విషయాన్ని చూస్తే బాగుంటుంది, అన్నిటిలోనూ నెగెటివ్ ఎందుకు అంటూ అభిప్రాయపడ్డారు.

ఆ ఫొటోలో ఉన్నదే చూసి నమ్మితే ఎలాగ, అంతకుముందు ఏం జరిగిందో చూడాలి కాదా అంటూ మాట్లాడారు నట్టి కుమార్. మన ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి సందర్బం వచ్చి చెప్పులు పట్టుకోవాల్సి వస్తే ఇలానే ట్రోల్ చేస్తారా అంటూ విమర్శించారు నట్టి. తన చేతులు ఖాళీలేక చెప్పులు పట్టుకోవాల్సి వస్తే అక్కడున్న అధికారి సహాయం చేసాడు అది కూడా తప్పేనా అంటూ ట్రోల్స్ చేయడం తప్పు అంటూ మాట్లాడారు.


































