Producer Pokuri Baburao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి. కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీ లోనే పరిచయం దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారీ, ప్రజాశ్వమ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.

విజయశాంతితో అనుకుని శారద తో సినిమా చేసాం…
అప్పటి వరకు టి కృష్ణ గారి నీడలో ఉన్న పోకూరి బాబు రావు గారు ఒక్కసారిగా క్యాన్సర్ తో కృష్ణ గారు మరణించడంతో ఇక సినిమాలు వద్దని ఒంగోలు వెళ్ళిపోవాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో పరుచూరి గారి ఇంటర్వ్యూ ఒక సినిమా పత్రికలో చూసాక వాళ్ళు కృష్ణ గారితో పనిచేయాలని అనుకున్నట్లు తెలిసీ ఒకసారి వెళ్లి కలవాలని వెళితే ఆయన ప్రజాస్వామ్యం సినిమా కథ లైన్ చెప్పి చేద్దామని చెప్పారు. అయితే అంతవరకు మొత్తం ఎగ్జిక్యూషన్ వర్క్ కృష్ణ చూసేవారు నాకేమి పెద్ధగా రాదని చెబితే మేము ఉన్నాం కదా కలిసి పనిచేసుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పడంతో ధైర్యం వచ్చి విజయశాంతి హీరోయిన్ గా సినిమా చేద్దామని అనుకున్నారట పోకూరి.

అప్పటికే విజయశాంతితో పలు సినిమాలను చేసిన వారు ఆమెను వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావించి చేస్తుందని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె బిజీ హీరోయిన్ అవడం వల్ల కుదరక పోతే పరుచూరి బ్రదర్స్ శారద గారిని పెట్టి సినిమా చేద్ధాం పోలీసు పాత్రను టీచర్ గా మారుద్దాం అని సలహా ఇచ్చారట. అలా ప్రజాస్వామ్యం సినిమా చేసి మళ్ళీ హిట్ కొట్టామని సినిమా జన్మ కృష్ణ ఇస్తే పునర్జన్మ పరుచూరి సోదరులు ఇచ్చారంటు చెప్పారు పోకూరి బాబు రావు.






























