Producer Rama Sathyanarayana : సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఎంతోమంది సినిమాల్లో నటించాలనో, డైరెక్టర్ అవ్వాలనో, సినిమా నిర్మించాలనో సినిమా రంగంలో ఎలాగోలా స్థిరపడాలని అనుకుంటారు. అలా ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చినా సక్సెస్ అయ్యేది మాత్రం కొంతమందే. ఇక అలానే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తన పేరు చూసుకోవాలని వచ్చి తాను ఎదుర్కొన్న సంఘటనలను పంచుకున్నారు రామ సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకోవాలనే తపనతో తాను పోగొట్టుకున్న డబ్బును గురించి వివరించారు.

సునీల్ సినిమాతో రూపాయి కూడా రాలేదు…
ఐస్ క్రీమ్, ధనలక్ష్మి తలుపు తడితే, అవంతిక, చట్టం, రహస్యం వంటి సినిమాలను నిర్మించిన రామ సత్యనారాయణ గారు సునీల్, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రధాన పాత్రలో ‘అతను ఆమె ప్రియుడు’ అనే సినిమాను తీశారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్టర్ గా వచ్చిన ఆ సినిమాను మూడు వందల పైగా థియేటర్లలో విడుదల చేస్తే సినిమా వల్ల ఒక్క రూపాయి రాలేదు.

బాగా నష్టపోయాను అంటూ చెప్పారు. ఇక పెద్ధ సినిమా ప్రొడ్యూసర్లందరూ చిన్న సినిమాలను రానివ్వరంటూ హాట్ కామెంట్స్ చేసారు. కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ అయితే థియేటర్ లో విడుదల చేయాలంటే సినిమాకి పది లక్షలు ఖర్చవుతుంది. అదే సీనియర్ ప్రొడ్యూసర్ అయితే ఐదు దాకా ఖర్చవుతుందని తెలిపారు.






























