Property Rights : ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపితే మా బాధ్యత పూర్తయింది అన్నట్లుగా భావించే కాలం పోయింది. కొడుకుతో సమానం కూతురు అన్నట్లుగా సమాజంలో మార్పులు వచ్చాయి. అందుకు తగ్గట్లే చట్టంలో కూడా మార్పులు వచ్చాయి. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకుతో పాటు కూతురుకూ అస్థిలో వాటా సమానంగా ఉంటుందంటూ చట్టం చేసారు. కూతురుకి పెళ్లి చేసినపుడు ఇచ్చిన కానుకలు అవన్నీ చేసిన వారు ఆస్తిలో సమాన వాటా అడిగే హక్కు లీగల్ గా వారికి వచ్చింది. అయితే మరి ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉన్నపుడు మరి పుట్టింటి అప్పుల సంగతి ఏమిటి అప్పుల్లో కూడా సమాన వాటా కూతురుకి ఉంటుందా ఉండదా అనే విషయాలను తెలుసుకుందాం.

ఆస్తి ఎలానో అప్పు అలానే…
ఈ విషయంలో హై కోర్ట్ న్యాయవాది కళ్యాణ చక్రవర్తి గారు మాట్లాడుతూ ఆడపిల్లకు పుట్టింటి ఆస్తి మీద ఎంత హక్కు ఉందో అప్పు మీద అంతే బాధ్యత ఉందని తెలిపారు. ఆస్తి పంచుకున్నట్లే అప్పు పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే పిల్లలు తండ్రి లేదా తల్లి చేసిన అప్పులను తీర్చాల్సిన విషయంలో కొన్ని అంశాలు ఉన్నాయంటూ తెలిపారు. ఇంటి పెద్ద ఆ కుటుంబంలోని పిల్ల చదువులు వారి జీవనోపాధి కోసం చేసే అప్పుల్ని ఆయన తరువాత వారి అస్థి తీసుకునే వారసులు సమానంగా ఆయన అప్పులను భరించాలి, తీర్చాలి.

లీగల్ గా కూడా అది చెల్లుబాటు అవుతుంది. అయితే ఇంటి పెద్ద ఏవైనా వ్యాసనాలకు లోబడి జూదం, గుర్రపు పందేలు, తాగుడు ఇలాంటివాటి కోసం అప్పులు చేస్తే వాటిని చెల్లించాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే ఆయన వ్యసన పరుడని తెలిసీ డబ్బు అప్పుగా ఇవ్వడం వారి విజ్ఞత. అయితే ఆయన జూదం ఆడటానికి, లేదా వ్యభిచార గృహం కోసమో డబ్బు అప్పు తీసుకున్నది నిరూపించగలగాలి అపుడు ఆ అప్పు ఆయన తదనంతరం ఆయన వారసులు తీర్చాల్సిన పనిలేదు అంటూ సందేహలను నివృతి చేసారు.































