టాలీవుడ్ కమిడియన్, ఎస్వీబిసి మాజీ చైర్మెన్ పృథ్విరాజ్ గత కొద్దిరోజులుగా మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.. అయన మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న విషయం తెలిసిందే.. టిక్ టాక్ మరియు మిగిలిన సోషల్ మీడియాలాలో తన వీడియోలను ఎడిట్ చేస్తున్నారని, తనను కించపరుస్తున్నారని అయన ఆరోపించారు. కాగా, వీటిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు.

గత కొద్దిరోజులుగా తన వీడియోలు ఎడిట్ చేస్తూ తనని ట్రోల్ చేస్తున్నారని మాజీ ఎస్వీబిసి చైర్మన్ పృద్వి రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పిర్యాదు చేస్తూ ఇటువంటి పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు పృద్వి. పృద్వి చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు పోలీసులు. త్వరలో ఇటువంటి పనులు చేసేవారిని పట్టుకుంటామని తెలిపారు.




























