Pudding pub issue government taking action:
గత రెండు రోజులుగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో జరిగిన పోలీసులా దాడులు వైరల్ అయ్యాయి ఎక్కడ రోజుకో మలుపు తిరుగుతూ హాట్ న్యూస్ అవుతోంది. తాజా గా తెలంగాణ ప్రభుత్వం ఈ పబ్ పై చర్యలు తీసుకోవడంతో మరోసారి వార్తలోకి వచ్చింది.

లైసెన్స్ రద్దు…పరారీ లో యాజమాన్యం…
నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రాజకీయ నేతలు నందీశ్వర్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్ కొడుకులు, మాజీ డీజీపీ కూతురు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లల పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసు సర్కారు వారి తాజా నిర్ణయంతో అనూహ్య మలుపు తిరిగినట్లయింది. హైదరాబాద్ లో డ్రగ్స్ దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే విపక్షాల ఆరోపణల క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఘటన జరిగిన ఒక రోజులోనే ఆ రెండు సంస్థలకు షాక్ ఇచ్చింది.
రాడిసన్ హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్ ఆ రెండు సంస్థల లైసెన్సులను తెలంగాణ ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. పబ్, లిక్కర్ లైసెన్స్‌లు రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాడిసన్ హోటల్ అంతర్జాతీయంగా పేరున్న ఫ్రాంచైజ్ కావడంతో వ్యాపార వర్గాల్లోనూ ఈ ఉదంతం చర్చకు దారి తీసింది.
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ పార్టీ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్, అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఏడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
2017లో కిరణ్ raj అతని భార్య తో కలిసి పబ్ ను లీజు కి తీసుకున్నారు. ఆ తర్వాత 2020ఆగష్టు లో అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ కి లిజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చిన కిరణ్ భాగస్వామి గా కొనసాగాడు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ పార్టీ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్, అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఏడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.



























