టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న “బుట్ట బొమ్మ” పూజ హెగ్డే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. సంక్రాంతికి విడుదలైన “ఆలా…వైకుంఠపురములో” చిత్రం టాలీవుడ్ లో భారీ హిట్ అందుకున్న తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం పూజ, అఖిల్ అక్కినేని సరసన “మోస్ట్ ఎలిజిబిల్ బ్యచులర్” సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ సరసన రాధాకృష్ణ డైరెక్షన్ లో “#ప్రభాస్20” సినిమాలో నటిస్తుంది. అంత బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ దొరకడం మెమోలు విషయమా? అయితే పవన్ మాత్రం ప్రయత్నించి భంగపడ్డాడు.
టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పేరుకి టాప్ హీరోలు కానీ వారితో నటించడానికి హీరోయిన్లే దొరకడం లేదు. ఈ పరిస్థితులు నందమూరి నటసింహం బాలయ్య వంటి హీరోలు ప్రతి సినిమాకు చూస్తున్నారు. అయితే తాజాగా ఇదే పరిసితి ఎదురవుతుంది మరో టాలీవుడ్ టాప్ హీరో.. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. సినిమాలు చేయను అని పాలిటిక్స్ చేసుకుంటూ.. మళ్ళి హఠాత్తుగా రీఎంట్రీ ఇచ్చి సినిమాల మీద సినిమాలు సైన్ చేసుకుంటూ దూకుడు మీద ఉన్న పవన్ కు హీరోయిన్ల రూపంలో చుక్కెదురవుతుంది. ఏకంగా 5 సినిమాలు కమిట్ అవుతున్న పవన్ ను హీరోయిన్ల బెడద పట్టుకుంది. మొన్ననే బాలీవుడ్లో హిట్ల మీద హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ కైరా అద్వానీని అడిగినా ఆమె కూడా డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు పూజ హెగ్డే కూడా పవన్ చేయనని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఏమయిందో ఏమో అద్భుతమైన అవకాశం నాకొద్దని చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ లో భారీ హిట్ అందుకున్న “పింక్” చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి “వకీల్ సాబ్” అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. అయితే ఈ వకీల్ సాబ్ కోసం పూజ ని అడిగితే కుదరదని చెప్పిందట. పవన్ కి వయస్సు అయిపోయింది అని అనుకుంటుందో లేక ఈ కథ నచ్చలేదో మొత్తానికి పవన్ తో నటించాను అని తేల్చి చెప్పేసింది.



























