Pujitha Ponnada : విశాఖపట్నంకు చెందిన పూజిత హాబీలా మొదలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం, ఆ తరువాత నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో అవకాశంతో సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. ఇక ఒకవైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా పని చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటించిన పూజిత ‘రంగస్థలం’ వంటి పెద్ద సినిమాలతో బిజీ అయింది. ఇక రామ్ చరణ్ తో నటించిన పూజిత, పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీర మల్లు లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించునుంది. ఇక ఈ మధ్యనే ‘ఆకాశ వీధుల్లో’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజిత ఆ సినిమా విశేషాలతో పాటు తన లవ్ బ్రేక్ అప్స్ గురించి కూడా తెలిపింది.

డిఎస్పి తో నా పెళ్లి రూమర్…
షార్ట్ ఫిలిమ్స్ నుండి పెద్ద సినిమాల్లో నటించే దిశగా కెరీర్ లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి పూజిత ప్రస్తుతం ‘ఆకాశ వీధుల్లో’ అనే సినిమాతో హీరోయిన్ గా రాబోతోంది. ఇక సినిమాల్లో అవకాశల కోసం పడిన ఇబ్బందులకు గురించి చెబుతూ తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉంటూ సినిమాలను హాబీ గా చేసానని, పెద్దగా అవకాశాల కోసం తిరగలేదని, వచ్చిన ఆఫర్ నచ్చితే చేశానని చెప్పింది. అయితే రంగస్థలం సినిమా తరువాత సినిమాలను సీరియస్ గా తీసుకున్నానని చెప్పింది.

ఇక తనకు రంగస్థలం సినిమా టైములో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. ఇక వీటి గురించి పూజిత చెబుతూ నాకు అసలు దేవిశ్రీ గారితో పరిచయం కూడా లేదు కానీ మా పెళ్లి అయిపోయినట్లు రూమర్స్ వచ్చాయి. ఇక రంగస్థలం సినిమా ఈవెంట్ లో మొదటి సారి ఆయనతో మాట్లాడాను అప్పటికే ఈ రూమర్ వచ్చి పోయి ఆరు నెలలు అయిపోయింది. ఇలాంటి రూమర్స్ ని నవ్వుకుని వదిలేస్తాను పెద్దగా పట్టించుకోను అంటూ పూజిత చెప్పింది.



























