బిగ్ బాస్ షో టాప్ సీక్రెట్స్ ను బట్టబయలు చేసిన పునర్నవి !!

0
229

బిగ్‌బాస్ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పునర్నవి భూపాలం గురించి బుల్లితెర ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు..! బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె రసవత్తరంగా పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. బుల్లితెరకు పరిచయం కాకముందు చిన్న సినిమాలలో నటించిన పునర్నవికి టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.

ఈమధ్యనే ‘ఒక చిన్న విరామం’ అనే చిత్రంలో కూడా నటించింది పునర్నవి. కానీ ఈ చిత్రం కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో పునర్నవి టాలీవుడ్ ఛాన్స్ ల కోసం హాట్ హాట్ గా స్కిన్ షో చేస్తూ వేడివేడిగా తన హాట్ హాట్ అందాలను ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి సలామ్ కొడుతూ గులామ్ అవుతున్నారు. పునర్నవి దురదృష్టమో లేక కరోనా మహమ్మారి మహత్మ్యమో కానీ దర్శక, నిర్మాతల చూపు మాత్రం ఈ ముద్దుగుమ్మపై పడటం లేదు. ఇక ప్రస్తుతాంశానికొస్తే.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పునర్నవి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది.

సినిమాలలో పునర్నవికి రాని గుర్తింపు బిగ్ బాస్ సీజన్3 కి వెళ్లొచ్చిన తర్వాత వచ్చిన సంగతి విదితమే. అయితే బిగ్‌బాస్ హౌస్‌ లోపల ప్రేక్షకుల ఊహకందని అంశాలెన్నో జరుగుతుంటాయని.. కానీ ఆ షో నిర్వాహకులు ఆ అంశాలన్నిటినీ కుదించిన తర్వాతే వాళ్లకు అవసరమైన అంశాలను మాత్రమే బయటకు చూపిస్తారని, బుల్లితెర ప్రేక్షకులు కూడా షోలో చూపించిందే వాస్తవమనే భ్రమలో ఉంటారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పునర్నవి బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత కూడా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అందరితోనూ టచ్‌లో ఉన్నట్టు తెలియజేసింది. అందరికన్నా ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తో తను రోజూ టచ్ ‌లో ఉంటడం విశేషమని చెప్పడమే ఈ ఇంటర్వ్యూలోని ట్విస్ట్. చదివారుగా.. బిగ్ బాస్ షో లో జరిగే టాప్ సీక్రెట్స్ ను పునర్నవి ఎలా బట్టబయలు చేసిందో.. మరి ఇకనుంచైనా మీరు ఏ షో చూసినా ఆ షోలో చూపించిందే నిజమని నమ్మేయకండి. “కెమెరా ముందు రీల్ లైఫ్.. కెమెరా వెనుక రియల్ లైఫ్” అన్న సత్యాన్ని మర్చిపోకండి.. మీరేం చదువుతున్నారో మీకర్ధమౌతుందా.?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here