ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్. ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో సుమారు 5 భాషల్లో “జేమ్స్” చిత్రాన్ని విడుదల చేసారు. పునీత్ చనిపోకముందు చివరగా నటించిన సినిమా కావడంతో అభిమానులంతా భావోద్వేగానికి గురవుతున్నారు. చివరిసారిగా స్కీన్ పై పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చూసి బరువెక్కిన హృదయంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

అయితే ‘జేమ్స్’ సినిమా గురించి ఒకప్పుడు పునీత్ రాజ్ కుమార్ చెప్పిన మాటలు తాజగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఆడియో విడుదల చేసింది ‘ది బిగ్ లిటిల్’ అనే కన్నడ మూవీ కంపెనీ. ఈ ఆడియోలో జేమ్స్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆ చిత్ర ఫైట్స్ మాస్టర్ రవివర్మతో పునీత్ మాట్లాడారు. ఆ ఆడియోలో పవర్ స్టార్ పునీత్ మాట్లాడుతూ.. ‘మాస్టర్ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సౌండ్, గ్రాఫిక్స్ మొత్తం ఎంతో అద్భుతంగా వచ్చాయి. థాంక్యూ మాస్టర్’ అంటూ పునీత్ ఫైట్ మాస్టర్ రవివర్మతో మాట్లాడారు. ఆ ఆడియో మీకోసం.. మీరు కూడా ఒక సారి వినేయండి.































