ప్రేక్షకులకు ‘బంఫర్ ఆఫర్’ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తమ్ముడు గుర్తున్నాడా.?!

0
352

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ అన్న అడుగు జాడల్లోనే నడుస్తూ మొదటిసారి డైరెక్షన్ వైపు అడుగులేశారు..‘బద్రి’, ‘బాచి’, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘భద్ర’ తదితర చిత్రాలకి కో- డైరెక్టర్ గా పనిచేశాడు. విశాఖ జిల్లా, నర్సీపట్నంకు దగ్గరలోని కొత్తపల్లిలో జన్మించిన సాయిరామ్‌ శంకర్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

అనుకోకుండానే ‘ఇడియట్‌’ చిత్రంతో నటుడిగా మారాడు. అందులో రవితేజ ఫ్రెండ్ గా తళుక్కు మెరిసి ఆకట్టుకున్న సాయిరాంకి ఆ టైంలో నటనంటే ఆసక్తి మొదలైంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ కు చెప్పడంతో తన అన్న డైరక్షన్ లోనే తెరకెక్కిన ‘143’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘డేంజర్‌’లో కార్తీక్‌ అనే పాత్రని పోషించి అలరించి.. ‘హలో ప్రేమిస్తారా’ చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేశాడు. అప్పటికీ హీరోగా సరైన గుర్తింపు రాకపోవడంతో మరోసారి ‘నేనింతే’ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాడు. పూరి జగన్నాథ్‌ తన తమ్ముడిని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా తన సొంత సంస్థలోనే ‘బంపర్‌ ఆఫర్‌’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. ఆ మూవీ హిట్టైన తర్వాత మరో హిట్ కోసం ప్రయత్నించాడు సాయిరాం శంకర్.

కానీ., ఆ తర్వాత వచ్చిన ‘వాడే కావాలి’, ‘యమహో యమః’, ‘వెయ్యి అబద్దాలు’, ‘దిల్లున్నోడు’ మొదలైన చిత్రాలు విజయాన్ని సాధించలేక పోయాయి. అదృష్టం కలిసి రావడం లేదని చివరి ప్రయత్నంగా రామ్‌ శంకర్‌ అని పేరు మార్చుకున్నా విజయాలు మాత్రం దక్కలేదు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, పట్టుదల అన్నీ ఉన్నా కానీ సాయిరాంకు కాలం కలిసి రాలేదు అనే చెప్పాలి. దాంతో వనజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకి జనన్య అనే ఓ పాప కూడా వుంది. ఇక అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ హీరో కమ్ కో- డైరెక్టర్ సాయిరాం శంకర్ ఫ్యామిలీ పెద్దగా బయట కనిపించరన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సాయిరాం వనజలు తమ పెళ్ళి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ ఫోటోలు వైరలవుతున్నాయి. కావాలంటే మీరూ సాయిరాం శంకర్ ఫ్యామిలీ ఫోటోలపై ఓ లుక్కేయండి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here