Puri Jagannadh: బండ్ల గణేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన క్షణాల్లో పెద్ద ఎత్తున వివాదాలను సృష్టిస్తూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నటువంటి బండ్ల గణేష్ తాజాగా పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బండ్లగణేష్ పూరి జగన్నాథ్ ను టార్గెట్ చేస్తూ ఎక్కువగా ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.

ఒక వైపు తన కొడుకు సినిమా విడుదల అవుతుంటే పూరీ జగన్నాథ్ కనీస బాధ్యత లేకుండా ఎక్కడో ముంబైలో కూర్చున్నారు. తన కొడుకు కన్నా ఏది ముఖ్యం కాదు. కొడుకు సినిమాకి సహాయం చేయాలనే తాపత్రయం ఏమాత్రం లేదు. జీవితంలో ఎన్నో వ్యాంపులు.. ర్యాంపులు వస్తుంటాయి అంటూ పరోక్షంగా తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ గురించి బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.దీంతో పూరి జగన్నాథ్ పరోక్షంగా బండ్ల గణేష్ ఉద్దేశిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వాయిస్ మెసేజ్ చేశారు.దీంతో ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా మంది పూరిజగన్నాథ్ బండ్ల గణేష్ ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
నీ లైఫ్… నీ డెత్.. నీ టంగ్ డిసైడ్ చేస్తుంది..
గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమి నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువగా మాట్లాడటం కన్నా వింటూ ఉండడం మంచిది. బయట మాత్రమే కాదు చివరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడటమే మంచిది. చీప్ గా వాగద్దు, చీప్ గా మాట్లాడొద్దు.. మన వాగుడే మన కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. తప్పుగా మాట్లాడటం కన్నా నాలుకను కత్తిరించుకోవడం మంచిది. చివరిగా ఒక మాట నీ లైఫ్.. నీ డెత్ ఎప్పుడు నీ టంగ్ పై ఆధారపడి ఉంటాయి అంటూ పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు బండ్ల గణేష్ ని ఉద్దేశించే చేశారని పలువురు భావిస్తున్నారు.
View this post on Instagram




























