ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ పరిచయం అవసరం లేని పేరు.. కారణం అయన తీసే సినిమాలు.. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన సత్తా మరోసారి నిరూపించుకుని, ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ మరియు అయన భార్య లావణ్య ల లవ్ స్టోరీ తెలుసుకుందాం…

పూరి జగన్నాద్ సినిమాల్లో డైరెక్షన్ చేయడానికి ముందు దూరదర్శన్ లో ప్రసారమయ్యే ఒక సీరియల్ కి దర్శకత్వం వహించారు. ఆ చిత్ర షూటింగ్ హైద్రాబాదులోని రామంతాపూర్ ప్రాంతంలో జరిగింది. అక్కడ ఒక ఇంటి దగ్గర ఈ సీరియల్ షూటింగ్ చేస్తుండగా.. మొదటిసారి లావణ్య ని చూసి ప్రేమలో పడిపోయాడు… “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” అన్న మాట. పెళ్లంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. అయితే అక్కడే ఉన్న ఒక అమ్మాయిని పిలిచి “ఆ మేడం దగ్గరకు వెళ్లి నా విజిటింగ్ కార్డు ఇవ్వు… ఆమె నాకు బాగా నచ్చింది.. నేను తనకి నచ్చితే ఈ నెంబర్ కి కాల్ చేయమని చెప్పు… ” అని చెప్పాడట. కానీ ఈ మాటలు విని ఊహించని ఈ సంఘటనకు ఖంగు తిన్న లావణ్య భయటంతో విజిటింగ్ కార్డు తిరిగి పంపించిందట. అయితే పూరి పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమె విజిటింగ్ కార్డు తీసుకునే వరకు పంపిస్తూనే ఉన్నాడట.

ఇది జరిగిన ఒక వారం తరువాత లావణ్య ఆ కార్డుపై ఉన్న ఫోన్ నంబర్ కి ఫోన్ చేసిందట. అయితే పూరి సినిమాల్లో ట్విస్ట్ ల లానే అయన స్టోరీలో కూడా ట్విస్ట్ ఉంది. ఆయన ఇచ్చిన నంబర్ పూరిది కాదట. అయన అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ నంబర్ అట. అయితే అది తెలుసుకున్న పూరి ఆమెకు తిరిగి ఫోన్ చేసాడట. ఎట్టకేలకు ఫోన్ లో పూరితో మాట్లాడారట లావణ్య.. “ఇలా పరిచయం లేని అమ్మాయిలకు నంబర్ ఇవ్వడమేనా..? ఇలా ఎంత మందికి ఇచ్చావు..? ” అంటూ మొదలైన వీరి సంభాషణ తరువాత కొద్దీ కాలానికి స్నేహం.. ఆపై స్నేహం కాస్త ప్రేమగా మారడం. ఇద్దరు రెస్టారెంట్లు, సినిమాలు అంటూ తిరగడం జరిగిన కొద్దిరోజులకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

ఇద్దరు వారి ఇంట్లో పెళ్లి గురించి చెప్పడం. వారు వ్యతిరేకించడంతో స్నేహితుల సమక్షంలో ఎవరికీ తెలియకుండా ఇద్దరు ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారట. పూరి లవ్ స్టోరీ చూస్తుంటే ఇడియట్ సినిమా గుర్తొస్తుంది కదా.? సినిమాలో హీరోయిన్ ని చూడగానే హీరో చెప్పే మొదటి డైలాగ్ “ఐ లవ్ యు”.. “చూసి చూడగానే లవ్వా” అని హీరోయిన్ అడగగానే.. హీరో..”గంట ఆగి చెప్పాలా…? రేపు చెప్పాలా…? ఒక వీక్ ఆగి చెప్పాలా..? ఎప్పుడు చెప్పినా ఒక్కటే ఇక్కడే ఏదుంటే అదే వస్తుంది.. ” అంటూ రవితేజ తో చెప్పించిన డైలాగ్ పూరి అయన నిజజీవితంలో నుంచి తీసినట్టే ఉంది. అయన సినిమాల్లోలానే పూరి జగన్నాద్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వార్డ్ మనిషి అనడానికి అయన ప్రేమ కధే మంచి ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here