Puri Jagannath : పూరీ జగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీ లో హీరోలను కొత్తగా చూపించడంలో ఈయన తరువాతే ఎవరైనా.. సినిమా హిట్ ప్లాప్ తో సంబందం లేకుండా ఆయనతో సినిమా తీయాలనీ అనుకుంటారు. సినిమాలో హీరోని విలన్ షేడ్ లో చూపించడం పూరీ స్టైల్. అయినా పూరీ మార్క్ సినిమాలో హీరోయిజమే కాదు, సినిమా కథలో కూడా విభిన్నత ఉంటుంది. సినిమా కథ మీద ఎంత పాత్ర ఉంటుందంటే పోకిరి సినిమా స్క్రిప్ట్ కేవలం వారంలో పూర్తి చేసేంత. అంతటి బ్లాక్ బస్టర్ ని కేవలం వారం లో రాసిచ్చారు. టాలీవుడ్ లో ఆయనంత వేగంగా సినిమా కథలు రాయగల డైరెక్టర్ ఇంకొకరు ఉండరు, అది మిగిలిన టాప్ డైరెక్టర్స్ చెప్పే మాట. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ మంచి సాలిడ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. ఇప్పుడు మరోసారి లైగర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా లెక్కల మాస్టారు సుకుమార్ తో పూరీ ఇంటర్వ్యూ చేసారు.

విజయేంద్ర ప్రసాద్ గారు నన్ను ఏనిమీ అంటారు…
సుక్కు, పూరీ గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేయాలని వెళితే అవకాశం దొరకలేదట, ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలతో పూరీ సుక్కు ఇంటర్వ్యూ సాగింది. ఇక ఇండియన్ గ్రేట్ స్క్రిప్ట్ రైటర్స్ లో రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఒకరు. అలాంటి వ్యక్తి పూరీ జగన్నాథ్ ఫోటో స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నారట.. ఈ విషయాన్ని సుక్కు పూరీ దగ్గర ప్రస్తావించగా ఏ అవార్డు కన్నా అది నాకు గొప్ప అవార్డు అంటూ చెప్పారు పూరీ. ఇక అప్పుడే ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు పూరీ జగన్నాథ్ ను ఏనిమి అని పిలుస్తారట. దీన్ని గురించి పూరీ చెప్తు ఊరికే సరదాగా అలా ఎనిమి అంటారు కానీ ఆయనకు నేనంటే చాలా ఇష్టం.

మా ఇద్దరి రైటింగ్ స్టైల్ వేరు ఉండడం వల్ల అలా అంటారేమో ఆయననే అడగాలి ఎందుకు అంటారో అంటూ ఆయనను మొదట కలిసిన సందర్భన్ని చెప్పారు. చెన్నైలో ఉన్నపుడు ఇంకా ఇద్దరం డైరెక్టర్స్ కాకముందే రాజమౌళి నాకు పరిచయం, రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారి కొడుకుగా తెలుసు. ఒకసారి పరిచయం చేయమని అడిగితే వాళ్ళింటికి తీసుకెళ్లాడు. ఆయన చెయిరులో ఒక మూలాన కూర్చొని పుస్తకం చదువుతున్నాడు చూడగానే ఒకలాంటి భయం వచ్చింది. పరిచయం చేస్తా అన్నా కానీ వద్దులే అంటూ నేను వెళ్ళిపోయాను అంటూ అప్పటి విషయాలను పంచుకున్నారు పూరీ జగన్నాథ్.



























