టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పోడ్ కాస్ట్ మీడియా’ అనే క్రొత్త విధానంలో తనకు సంబంధించిన ఆడియోలని సోషల్ మీడియాలో లక్డికా పూల్ అంటూ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆయన పరువు అనే టాపిక్ పై షేర్ చేసిన ఆడియో బాగా వైరలవుతుంది.

వృత్తి పరంగా పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లని అతి సులువుగా రాసే పూరి జగన్నాథ్ అంతే పదునైన మాటలతో ఈ ఆడియోని షేర్ చేసే విధానం శ్రోతలందరినీ ఆకట్టుకుంటోంది. ఇంట్లో వాళ్ల ఏడుపు.. ఎప్పుడూ నలుగురేనుకుంటారో.. సొసైటీలో మన పరువు పోతుందో అని.. సొసైటీ అంటే ఎవరు.? మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ టాగూర్, అంబేద్కర్ లాంటి వాళ్లతో నిండిపోయిందా? లేదు కదా? మన చుట్టూ 100 మంది వుంటే వాళ్ళల్లో మంచి వాళ్లు ఐదుగురు కూడా వుండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్ లెస్ అనేకదా..

మనకంటే యెధవలు సొసైటీ నిండా ఇంతమంది వున్నప్పుడు వాళ్ల కోసమా నువ్వు బాధపడేది.? నీ ఇంట్లో ఎలాంటి అనర్థం జరిగినా కంగారు పడాల్సిన పని లేదు. మంచోళ్లు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. మిగతా యెధవలు అర్థం చేసుకుంటే ఏంటీ.. చేసుకోకపోతే ఏంటీ.? అనర్థం జరగని ఇళ్లే వుండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్ గురించి ఆలోచించాలి కానీ పరువు గురించి ఆలోచించకూడదు అంటూ పూరీ జగన్నాథ్ విడుదల చేసిన ‘పోడ్ కాస్ట్ మీడియా’ ఆడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరలవుతోంది



























