Puri Jagannath : నేటి తరంలో చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే ఆలోచనలు ఎక్కువైపోయాయి. మారుతున్న జీవనసరళి, కుటుంబ పరిస్థితుల వల్ల చాలా మంది క్షనికావేశంలో ప్రాణాలని కోల్పోతున్నారు. ఇక ఇలాంటి ఆత్మహత్యల వార్తలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ లో వినిపిస్తుంటాయి. పైకి కనిపించే రంగుల ప్రపంచం వేరు అక్కడ పనిచేసే వారి జీవితాలు వేరు. పైకి నవ్వుతూ కనిపించే వారి జీవితాలను వెనుక ఎన్నో బాధలు భయాలు ఉంటాయి. అలానే నేడు మరో ప్రాణం సమస్యల నుండి పోరాడలేక ప్రాణాలను బలి తీసుకుంది.

పూరీ అసిస్టెంట్ గా గుర్తింపు…
దుర్గం చెరువులోకి దూకి సాయి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతని మరణానికి సంబందించిన కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు అతను ఇంతకు ముందు కొంత కాలం పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సాయి కుమార్ అని తెలిసింది.
అప్పుల తీవ్రత, ఆర్ధిక ఇబ్బందులకు నేపథ్యంలో సాయి కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. అప్పుల తాకిడిని తట్టుకోలేక దుర్గం చెరువులో దూకి సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణ లో వెల్లడైనట్లు మాదాపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు.



























