R. Naryana Murthi : విప్లవ సినిమాలనగానే గుర్తొచ్చే పేరు ఆర్ నారాయణ మూర్తి. బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికోసం, వారిలో చైతన్యం కలిగించడం కోసం సినిమాలను తీశారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన స్నేహ చిత్ర పిక్చర్స్ తో సమాజంలో దిగువ శ్రేణిని ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తారో తన సినిమాల ద్వారా తెలియజేసాడు. వివాహం కూడా చేసుకోకుండా ఆయన తన జీవితంలో సినిమాలు, ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పని చేస్తూ ఉంటారు. లాభనష్టాలు, విజయాలు, పరాజయాలు తేడా లేకుండా కేవలం విప్లవ సినిమాలు, రైతుల కష్టాల మీద సినిమాలు తీస్తు టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఆర్. నరాయణ మూర్తి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆర్. నారాయణ మూర్తికి మాతృ వియోగం…
ఆర్. నారాయణ మూర్తి తల్లిగారైన చిట్టెమ్మ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లోని మల్లం పేటలోని ఆయన స్వగృహంలో రెడ్డి చిట్టెమ్మ గారు మృతి చెందారు. 93 సంవత్సరాలు వయసు వున్న రెడ్డి చిట్టెమ్మ గారు వయోభారంతోనే కన్నుమూసినట్టు సమాచారం.

రెడ్డి చిట్టెమ్మకు మొత్తం ఏడుగురు సంతానం కాగా.. అందులో మూడో సంతానం ఆర్.నారాయణ మూర్తి. రెడ్డి చిట్టెమ్మ గతంలో పలు ఇంటర్వ్యూలలో నారాయణ మూర్తి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. సంపాదించడం, ఆస్తులు చేసుకోవడం కంటే ఆపదలో వున్నవారిని ఆదుకోవడమే తనకు ముఖ్యమని కొడుకు గురించి గొప్పగా చెప్పారు. ఇది ఇలావుండగా చిట్టెమ్మ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
































