ఆ సీరియల్ కోసం రాశి రెమ్యునరేషన్ ఏంతో తెలుసా?

0
231

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి దశాబ్దం క్రితం వరకూ సెంటిమెంట్, లవ్ పాత్రలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, గోకులంలో సీత, స్నేహితులు, దేవుళ్ళు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాశికి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన సమయంలో.. ‘నిజం’ ‘కళ్యాణ వైభోగం’ ‘లంక’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ అవి కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇదిలా ఉండగా..

ఇక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది రాశీ. అయితే గత కొంతకాలంగా తన యుట్యుబ్ చానల్ ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు ముందు వచ్చారు రాశి. మాటీవీలో ప్రసారమవుతున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌లో అందరినీ అలరిస్తుంది. టీఆర్పీ రేటింగులో దూసుకుపోతున్న ఈ సీరియల్‌ ముఖ్యంగా రాశీ పాత్రకు మంచి మార్కులే పడుతున్నయట.

హిందీలోని ‘దియా ఔర్ బాతి హమ్‌కు’ అనే సీరియల్‌ ను తెలుగులో ‘జానకి కలగనలేదు’ అంటూ తెరకెక్కిస్తున్నారు. ఇక బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మరోసారి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ సీరియల్‌ కోసం రాశీ భారీ రెమ్యునరేషనే అందుకున్తుందట. రాశి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారానికి దాదాపు లక్ష రూపాయల రెమ్యునరేషన్‌ ఇస్తున్నారట ఈ సీరియల్ నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here