గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం కలకలం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు సంబంధించిన రాసలీల వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఒక మహిళతో నసీర్ అహ్మద్ వీడియో కాల్‌లో మాట్లాడిన అసభ్యకర దృశ్యాలను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగింది?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో నసీర్ అహ్మద్ ఒక మహిళతో అసభ్య సైగలు చేస్తూ, అనుచితంగా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా, ఎమ్మెల్యే తన ఆఫీస్ నుంచి ఈ వీడియో కాల్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో బయటకు రావడంతో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “చంద్రబాబు కామ పార్టీ సిత్రాలు ఇవేనా?” అంటూ వైసీపీ ఘాటైన విమర్శలు చేసింది. అంతేకాకుండా, నసీర్ అహ్మద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదే తొలిసారి కాదు..
టీడీపీ నాయకులపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళతో నగ్నంగా ఉన్న వీడియోలు, అలాగే హిందూపురం నేత యుగంధర్ అలియాస్ చింటు ఒక ముస్లిం మహిళను ఉద్యోగం పేరుతో వేధించిన ఘటనలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక అమ్మాయి స్కూల్ అడ్మిషన్ కోసం ఒంటరి మహిళను వేధించిన టీడీపీ నేత ఉదంతాన్ని కూడా వైసీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇలాంటి వివాదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటం టీడీపీ నాయకత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఘటనలన్నీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
🚨 #CBNKamaParty
— YSR Congress Party (@YSRCParty) August 4, 2025
చంద్రబాబు ''కామ'' పార్టీ సిత్రాలు….!
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు.
గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
బాధితురాలు ట్రైన్‌లో… pic.twitter.com/S37FRfW6wW

































