ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న తరుణంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చాడు. తనవంతు సాయంగా రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించాడు. అందులో పీఎం కేర్ ఫండ్స్ కు రూ.50 లక్షలు , తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.50 లక్షలు, డాన్సర్స్ యూనియన్ కు రూ.50 లక్షలు, పెప్సీ యూనియన్ కు రూ.50 లక్షలు, అలాగే తన దగ్గర ఉన్న దివ్యంగులకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించాడు.

అంతేకాదు తన సొంత గ్రామమైన రోయపురానికి చెందిన రోజువారీ కూలీలకు మరియు ప్రజలకోసం మరో రూ.75 లక్షలు ప్రకటిస్తున్నట్టు రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని తన తదుపరి సినిమాలో తన రెమ్యూనరేషన్ ముందుగానే అడ్వాన్స్ గా తీసుకుని ఈ అమౌంట్ ని సమీకరించనున్నటు తెలిపారు.




























