Raghavendra Rao son divorce : ఒకప్పుడు విడాకులు తీసుకుంటోంది ఒక జంట అంటే ఎన్నో చర్చలు, పెద్దమనుషుల పంచాయితీలు అన్నీ అయ్యాక అప్పటికీ వారి మధ్య సఖ్యత లేకపోతే అప్పుడు విడాకులు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటికి కట్టిన మావిడాకులు ఎండే లోపే కొత్త జంట విడాకులంటున్నారు. పెద్దలు కూడా చాలా సందర్భాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. పోనీ అంత బలమైన కారణాలతో భార్యభర్తలు విడిపోతున్నారా అంటే ఎవరో నూటికి ఒకటి అరా మాత్రమే అలా బలమైన కారణం తో విడాకులకు వెళ్లే వారు. మిగతా వారంతా ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమించడమో, లేకపోతే వ్యక్తిగత స్వేచ్చ పేరిట విడాకులకోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ఈ పోకడ బయట జనంతో పోలిస్తే సెలబ్రిటీల విషయంలో మరీ కాస్త ఎక్కువ.

సూర్యప్రకాష్, కనిక థిల్లాన్ విషయంలో జరిగింది అదే…
తెలుగు ఇండస్ట్రీ లో దర్శకుడు రాఘవేంద్రరావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన తండ్రి దగ్గరినుండి సినిమా ఇండస్ట్రీ లో ఉన్నారు, గొప్ప పేరుంది. అలాంటి రాఘవేంద్రరావు గారి అబ్బాయి సూర్యప్రకాష్ ను కూడా హీరో అనుకున్నా సెట్ అవ్వలేదు ఒక సినిమాతో ఆపేసారు. మరో సినిమా ఇండియన్ ఇంగ్లీష్ మూవీ చేశారు. ఇక డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీ లో సెట్ అవుతారని అనుకున్నా ఇంకా అది జరగలేదు. ఇక ప్రకాష్ బొంబాయి లోనే వర్క్ చేసుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లిస్ సంస్థ లో స్టార్ రైటర్ గా ఉన్న కనిక థిల్లాన్ తో పరిచయం ఏర్పడించి. ఒకసారి ఆమెకు ఆరోగ్యం బాగోలేక వారం పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తే ప్రకాష్ అన్ని తానై చూసుకున్నాడట. ఇక ఆ తరువాత వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. రాఘవేంద్రరావు కి ఈ పెళ్లి ఇష్టం లేక పోయినా ఒప్పుకున్నారట కొడుకు కోసం.

అంతా బాగున్నా ఇద్దరూ ప్రేమలో మునిగి తెలిపోయి పెళ్లి చేసుకున్నాక, ఇద్దరూ సినిమా ఫీల్డ్ అవ్వడంతో వర్క్ కూడా కలిసి చేసుకునేవారట. సైజ జీరో సినిమాను ప్రకాష్ డైరెక్టర్ చేస్తే కనిక స్టోరీ ఇచ్చింది. అయితే అది అంత సక్సెస్ కాలేదు. ఇయతే కనిక స్టోరీస్ బాలీవుడ్ లో మంచి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక కనిక తన వర్క్ కోసం ముంబై లో ఉంది. కానీ సూర్యప్రకాష్ మాత్రం హైదరాబాద్ లో తన తండ్రి లానే తాను టాప్ డైరెక్టర్ అవ్వాలని ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నాడు దీంతో ముంబై లో కనిక హైదరాబాద్ లో ప్రకాష్ ఉండాలని పట్టుబట్టడంతో, మనస్పర్థలు మొదలయ్యాక రెండేళ్లు ఇద్దరూ విడివిడిగా ముంబై లో కనిక థిల్లాన్, హైదరాబాద్ లో సూర్యప్రకాష్ ఉండిపోయారు. తరువాత విడాకులు తీసుకున్నారు.



























