Raghunath Reddy : రామానాయుడు గారు నిర్మించిన ‘సర్పయాగం’ సినిమాతో ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించిన వారు రఘునాథ్ రెడ్డి. చాలా సినిమాల్లో తండ్రి, మావయ్య పాత్రలతో అలరించిన ఆయన రంగస్థల నటులు. సినిమాల మీద ఆసక్తితో అందులోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి రావాలని ఇష్టంతో వచ్చానని సినిమాలలో నటించాలనుకున్నాను కానీ డబ్బు కోసం కాదు అంటూ అందుకే రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించలేదంటూ తెలిపారు. ఇక ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు నాతో సరదాగా ఉంటారంటూ ఆయన అనుభవాలను పంచుకున్నారు.

మోహన్ బాబు అలా అరిచాడు…
మోహన్ బాబు నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను రఘునాథ్ రెడ్డి గారు వివరించారు. ఎపుడూ మోహన్ బాబు గారితో జోకులు వేస్తూ ఇద్దరం నవ్వుకునేవాళ్లమని చెప్పిన ఆయన మోహన్ బాబు ఎవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదని, తనతో జోకులు వేసేంత చనువు చాలా తక్కువ మందికి ఉందంటూ చెప్పారు. ఇక అలా ఒరోజు షూటింగ్ లో నా సీన్ చేస్తున్న సమయంలో సడెన్ గా వచ్చి అందరి ముందు అరిచారు ఒక్కసారిగా అందరూ లైట్ బాయ్ తో మొదలుకుని భయపడ్డారు.

ఆ సినిమాలో శ్రీహరి కూడా నటిస్తున్నారు. సరిగ్గా అపుడే శ్రీహరి, మోహన్ బాబు వచ్చి ఏమనుకుంటున్నావ్ నీ గురించి అని నన్ను అనే సరికి శ్రీహరి వచ్చి ఎస్వి రంగారావు అనుకుంటున్నట్లు ఉన్నాడు అంటూ అనేసరికి అప్పటికి అర్థమైంది వాళ్లిదరూ నన్ను ఆటపట్టిస్తున్నారని అందరూ అప్పుడు ఫ్రీ అయ్యారు. ఒక్క క్షణం షూటింగ్ సెట్ అంతా సీరియస్ గా మారిపోయింది అంటూ చెప్పారు. ఇక శ్రీహరి తనను బాబాయ్ అంటే నేను తనని అబ్బాయి అంటూ పిలుస్తానని తెలిపారు.



























