Rahul Ramakrishna comments on TV9: విశ్వక్ సేన్, దేవి నాగవల్లి ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతూ వైరల్ అవుతోంది. విశ్వక్ తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయం పై స్పందిస్తూ ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇక దేవి నాగవల్లి జర్నలిస్ట్లనుండి, మహిళలు సంఘాల నుండి మద్దతు కూడగడుతూ ఉంది. ఈ ఇష్యూ లో తప్పు ఇద్దరిది ఉన్నా కేవలం విశ్వక్ ని మాత్రమే బలి చేయడం నెటిజన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఈ విషయంలో టీవీ 9 ను, దేవి నాగవల్లి ని బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ విషయంలో విశ్వక్ కు దేవి నాగవల్లి కి వచ్చినంత మద్దతు సినిమా పరిశ్రమ నుండి లభించలేదు. చిన్న హీరో అవడం వల్ల అందునా ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని హీరో అవడం వల్ల విశ్వక్ ను సినీ ఇండస్ట్రీ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూలో స్పందించిన రాహుల్ రామకృష్ణ తన పూర్తి మద్దతు విశ్వక్ కి ఇచ్చాడు ఇక సీనియర్ నటి కస్తూరి, బాబు గోగినేని కూడా తమ మద్దతును తెలిపారు.
టీవీ 9 తెలుగు రాష్ట్రాలకు దౌర్భాగ్యం….
Selling rumours and gossip is a cost effective way of assassinating a person. @TV9Telugu does a classic job of it.
— Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022
Now that I think of it, only @TV9Telugu has the legendary history of having it’s prime news anchors call autopsy as auto spy technology.
— Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022
Such learned, wise people run the show
ఇప్పటి మీడియా మీద చాలా మందికి మంచి ఉదేశ్యం లేదు. ఇది బహిరంగ రహస్యమే అయిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన వాఖ్యలు మాత్రం ఇపుడు బాగా వైరల్ అయ్యాయి. విశ్వక్, దేవి నాగవల్లి ఇష్యూ తరువాత వరుస ట్వీట్ల తో ఫైర్ అయ్యాడు. టీవీ 9 ను ఒక దౌర్భాగ్యమైన ఛానెల్ డబ్బులకోసం మాత్రమే న్యూస్ కవర్ చేస్తుంది. నీచమైన రూపంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించే ఛానెల్, ప్రజలను ఆకట్టుకోడానికి ఏమైనా చేస్తుంది అంటూ వరుస ట్వీట్లతో ఫైర్ అయ్యాడు.
































