Rahul Ramakrishna supports Vishwak Sen : విశ్వక్ సేన్, టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి వీళ్ల మధ్య జరిగిన వాగ్వాదాం బాగా వైరల్ అయింది. విశ్వక్ సేన్ అభిమాని ప్రాంక్ వీడియోతో వచ్చిన తంట, ఇక ఇలాంటి వైరల్ న్యూస్ కోసం బాగా వెతికే tv9చేతికి దొరికింది. ఇంకేముంది ఈ ఇష్యూ పై డిబేట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ ను ఏకిపారేశారు. చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ మాట్లాడారు. ఇక సీన్ లోకి విశ్వక్ ఎంటర్ అయ్యి దేవి నాగవల్లి తో మాట్లాడటం ఈ మాటలు కాస్త గొడవకు వాగ్వాదాం కి దారితీశాయి. విశ్వక్ ను పాగల్, డిప్రెస్డ్ పర్సన్ అంటూ మాట్లాడటం దేవి తప్పైతే, ఆ మాటలు ఎందుకు అన్నావ్ వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగినందుకు దేవి గెట్ అవుట్ అంటూ గట్టిగా మాట్లాడటంతో విశ్వక్ ఎఫ్ పదంతో వచ్చే పరుష పదజాలం వాడాడు. ఇక ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇక ఇరువురి కోసం మద్దతు ఇస్తూ చాలా. మంది సోషల్ మీడియాలోను కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు కామన్ నెటిజన్స్ విశ్వక్ కి మద్దతుగా నిలిచి ఒక చిన్న హీరో కాబట్టి ఇలా చేస్తున్నావ్ అంటూ దేవి నాగా వల్లిని ట్రోల్ చేస్తున్నారు. ఇక దేవి ఈ ఇష్యూ పై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కంప్లైన్ట్ చేసారు. ఇక తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ కుడా దేవి కి సపోర్ట్ గా నిలిచి ఘాటు వాఖ్యలు చేసారు.
I’d like to be a part of the circus that is surrounding and humiliating a grounded, humble person as #VishwakSen
— Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022
He has my total support especially in light of how @TV9Telugu treated him. I don’t know what they do to journalists these days..jeez..
ఇక విశ్వక్ కు మద్దతుగా ఇప్పటికే సీనియర్ హీరోయిన్ కస్తూరి వీడియో చూసాక నీపై గౌరవం పెరిగిందంటూ ట్వీట్ చేసారు. ఇక ఇపుడు మరో సెలబ్రిటీ అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామకృష్ణ కూడా తన మద్దతును విశ్వక్ కు తెలిపాడు. విశ్వక్ లాంటి నిడారంబర వ్యక్తిని చుట్టుముట్టి అవమానిస్తున్న ఈ సర్కస్ లో నేను భాగం కావాలనుకుంటున్న నా పూర్తి మద్దతు విశ్వక్ కి ఇస్తున్నtv9 తెలుగు విశ్వక్ ను ఇలా ట్రీట్ చేసింది ఈరోజుల్లో జర్నలిస్టులను ఏమి చేస్తున్నారో తెలియడంలేదు అంటూ ట్వీట్ చేసాడు. ఇక ట్వీట్ కు నెటిజన్స్ కూడా మరికొంత మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి విశ్వక్ కి మద్దతు ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.































