రాహుల్ సిప్లిగంజ్.. సింగర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు హీరో అయ్యేంతవరకు ఎదిగాడు.. బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ ని వందకి వంద స్థం ఉపయోగించుకుంటూ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. ఇప్పటికే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో నటిస్తున్న రాహుల్ ఇప్పుడు ఏకంగా హీరోగా చేయడం విశేషం..నిజానికి బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరు లైఫ్ ఇప్పుడు మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ముందు ఉన్న పాపులారిటీ కంటే ఆ తర్వాత వచ్చిన పాపులారిటీ వేరు.. ఎక్కడికెళ్లినా వారిని గుర్తుపడుతున్నారు.
సామాన్య వ్యక్తిగా వచ్చిన వారు కూడా సెలబ్రిటీ అయిపోవడం గత సీజన్ లలో మనం చూశాం.. ఎవరికీ వారు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని అందరిని ఫ్యాన్స్ ని చేసుకుంటున్నారు.. తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తవగా దాదాపు 80 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.. వీరిలో అందరు మంచి పాపులారిటీ తెచ్చుకోగా సీజన్ 3 లో అలరించిన రాహుల్ ఇప్పుడు హీరోగా చేయడం విశేషం..బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ మూలాన సింగర్ కాస్తా నటుడు అయ్యాడు. అలా వ్యాపార రంగంలోకి దిగి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మొత్తంగా హీరోగా మారిపోయాడు.
ఈ క్రమంలో తన ఊకో కాక బ్రాంచ్‌ను సిద్దిపేటలో ఘనంగా ప్రారంభించబోన్నాడు. ఈ సందర్భంగా తన కొత్త మూవీ ప్రకటన కూడా చేయబోతోన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితుడితో కలిసి ఊకో కాక అనే మెన్సే వేర్ బిజినెస్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊకో కాకను ప్రమోట్ చేసేందుకు, అన్ని చోట్లా షోరూంలను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే హైద్రాబాద్, దాని పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లోనూ ఊకో కాకను ప్రారంభించాడు.ఇక మార్చి 19న సిద్దిపేటలో ఊకో కాకను రాహుల్ ప్రారంభించబోతోన్నాడు. ఈ ఈవెంట్‌కు మంత్రి హరీశ్ రావును ముఖ్య అతిథిగా పిలిచినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌లోనే హీరోగా రాబోతోన్న మూవీ టైటిల్, సినిమాలోని సాంగ్‌ను విడుదల చేయబోతోన్నట్టు తెలిపాడు. మొత్తానికి అటు వ్యాపారాన్ని, ఇటు సినీ కెరీర్‌ను రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తున్నాడు.