Rahul Sipligunj & Niharika : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫూడింగ్ పబ్ సమయానికి మించి రాత్రి నడపడంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఇక ఈ దాడి లో దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే తొలుత ప్రముఖ టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్ వార్త బయటికి వచ్చింది.

పబ్ లో నాగబాబు కూతురు నిహారిక
ఇక సమయం గడిచే కొద్దీ ప్రముఖుల పిల్లల పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు, మాజీ డీజీపీ కూతురు ఉన్నారని సమాచారం.
పోలీసులు పబ్ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక బంజారాహిల్స్ సీఐ ను సస్పెండ్ చేసారు. ఇక అరెస్ట్ అయిన సెలబ్రిటీ పిల్లలు తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని పోలీసులతో ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
Police confirmed that @Rahulsipligunj and @IamNiharikaK were also detained from the hotel. #Hyderabad #Tollywood #telugufilmnagar https://t.co/Fzc9nc6NH4
— Abhinay Deshpande (@iAbhinayD) April 3, 2022

































