హైదరాబాద్ ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. సుమారు ఒక గంటపాటు సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. ఈ దృశ్యాన్ని చూడటానికి జనాలు రోడ్లమీదకి వచ్చారు.. తమకు కనువిందు చేస్తున్న అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. నగరంలోని అనేక ప్రాంతాలలో ప్రాంతాల్లోనూ దృశ్యాలు కనువిందు చేసాయి.. సరిగ్గా ఇటువంటి దృశ్యమే గత నెలలో బెంగళూరు పరిసర ప్రాంతాలలో కనిపించింది. అప్పుడు కూడా సోషల్ మీడియా ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. అయితే దీనిని “సన్ హాలో” అని కూడా అంటారు. సూర్యుడి లేదా చంద్రుడి చుట్టూ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి సూచిక అంటారు.

ఇదిలా ఉంటే, ఈ ద్రుశ్యంపై అప్పుడే పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సూర్యుడు చుట్టూ ఇలా ఏర్పడటం అశుభమంటూ పుకార్లు పుట్టించేసారు. అయితే ఈ పుకార్లను ఎవరూ నమ్మొద్దని చెబుతున్నారు బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని “22-డిగ్రీ హలోస్” అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.































