పశ్చిమ బెంగాల్ తీరం మరియు ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్ స్థాయి వరకు వ్యాపించింది. అయితే ఇది రానున్న రెండు మూడు రోజులలో మరింత బలపడే అవకాశం ఉందని, ఆ పై పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించే అవకాశముంది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.



























