ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర మరియు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక తెలంగాణ తో పాటూ కోస్తాంధ్ర కూడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రెండు, మూడు రోజుల్లో దేశమంతా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.



























