తెలుగు అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జక్కన ఫాన్స్ ఎదురుచూస్తున్నా సినిమా “ఆర్ఆర్ఆర్”. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్ లు అన్నిటికీ బ్రేక్ పడింది. మళ్ళి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. దీనిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. ఇటువంటి సమయంలో “ఆర్ఆర్ఆర్” విడుదలపై జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో జక్కన్న ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడట.. అందులో ఈ వాయిదా విషయాన్నీ అధికారికంగా ప్రకటించబోతున్నాడట రాజమౌళి.

ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటుగా మరికొందరు విదేశీ నటులు, టెక్నిషియన్స్ భాగమైన విషయం తెలిసిందే. వీరంతా షూటింగ్లో పాల్గొనాలంటే భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయాలి. ఆ తరువాత గాని విదేశీ ఆర్టిస్టులు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి వీలుపడదు. ఇక ఆ తరువాత వచ్చే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ విడుదలను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయాలని జక్కన్న యోచిస్తున్నాడట.

మొదట్లో జులై 30న చేస్తామని చెప్పిన చిత్రం ఆ తరువాత నుంచి వాయిదా పడుతూ వచ్చింది. జులై 30న విడుదల చేస్తామని చెప్పారు.. ఆ తరువాత షూటింగ్ ఆలస్యమైన కారణంగా వచ్చే ఏడాది జనవరి 8 కి వాయిదా పడింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా మరో సారి వాయిదా పడబోతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here