రాజమౌళి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండేమో.. అపజయం ఎరుగని దర్శకుడు.. అయన సినిమా మొదలు పెట్టాడంటే ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోలను మాత్రం శాసించగలిగే స్థాయిలో ఉన్నారు దర్శకుడు రాజమోళి. ఆయన తీస్తున్న సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అంటే నటీనటులకు ఆస్కార్ లభించినంత అంనందమే. రాజమౌళి ఒక్క సినిమాకి దాదాపు హాలీవుడ్ దర్శకులు తీసుకునేంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. మన దేశంలో ఏ దర్శకుడు కుడి ఆంత రెమ్యూనరేషన్ తీసుకోవడంలేదు.

అంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికులకు ఇచ్చిన విరాళం చుస్తే మన కళ్ళు బైర్లు కమ్ముతాయి. అయన ఎంత ఇచ్చాడో తెలుసా? తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ధనిక దర్శకుడు, కేవలం ఒక్క బాహుబలి సినిమాకే 100కోట్లు అందుకున్న దర్శాదిగ్గజం సినీ కార్మికులకు ఇచ్చిన విరాళం మొత్తం రూ.5 లక్షలు. అది కూడా ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో కలిపి 10లక్షలు ప్రకటించాడు. సుమారు 400 వందల కోట్లతో సినిమా తీస్తున్న దర్శకుడు తన సినీ కార్మికులకు ఇచ్చిన విరాళం కేవలం ఐదు లక్షలు..

కేవలం యాభై లక్షలు రెమ్యూనిరేషన్ కూడా తీసుకొని విశ్వక్ సేన్ సైతం 10 లక్షలు విరాళం అందించాడు. దర్శకుల్లో రాజమోళి అంత భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా నాలుగదైదు చిన్న సినిమాలు చేసిన డైరెక్టర్లు అనిల్ రావిపూడి, కొరటాల శివలు సైతం రూ. 5లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ లెక్కన చుస్తే జక్కన్న పెద్ద దర్శకుడే కావొచ్చు కానీ దానగుణంలో మాత్రం చాలా ఇంత పిసినారా అని ముక్కున వేలేసుకుంటున్నారు సినీ అభిమానులు..



























