నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను 2022, జనవరి 7న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయాలనుకుని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం మేరకు జక్కన్న అండ్ టీమ్ మరో డేట్‌ను ఫిక్స్ చేశారట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను డిసెంబర్ 09న విడుదల చేయనున్నట్లు జక్కన్న టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ట్రైలర్ విడుదల కోసం ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎందో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఆథ్యంతం ఎమోషనల్ తో ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. బ్రిటీషర్ తో జరిగే పోరాట సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో అజయ్ దేవగణ్ భార్యగా శ్రీయ నటించారు. అయితే ఈ సినిమాలో జక్కన్న ఓ సన్నివేశంపై ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేశారట.
ఆ సన్నివేశం దాదాపు 30 నిమిషాల నిడివి ఉంటుందని.. ఈ సన్నివేశంలోనే అజయ్ దేవగణ్ భార్య శ్రీయ మరణిస్తారట. అంతే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సన్నివేశంలోనే తారసపడుతారనేది టాక్. ఎంతో ఎమోషనల్ టచ్ గా ఉండే దీనిపై జక్కన్న తన ప్రతిభను చూపించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో జరిగే ప్రతీ సీన్ ఎలాంటి కట్ లు లేకుండా.. అలానే సినిమాలో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





























