Rajamouli shares his best episode in RRR : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక్కో వ్యక్తికి ఒక్కోలాగా సన్నివేశాలు నచ్చడం కామన్. ఇక ఆర్ఆర్ఆర్ తీసిన జక్కన్న కు ఏ సన్నివేశం నచ్చింది.. ఈ విషయం అందరికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటివరకు నా కెరీర్ బెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ అని అనిపిస్తోందని తాను ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంకా ప్రేమిస్తున్నానని జక్కన్న అన్నారు. అయితే తన కెరీర్ బెస్ట్ మూవీ ఏది అన్న ప్రశ్నకు మరో ఏడు నెలల తర్వాత సరైన సమాధానం చెప్పగలనని రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే పెర్ఫామెన్స్ ల విషయంలో చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ఆర్ బెస్ట్ వర్క్ అని జక్కన్న కామెంట్లు చేశారు.

కొమురం భీముడో నచ్చింది…..
ఇక తన చిత్రంలో నచ్చిన సన్నివేశం ఏంటనే ప్రశ్నకు సమాధానంగా కొమరం భీముడో పాటకు చేసిన వర్క్ బాగా నచ్చిందని రాజమౌళి మనసులోని మాట చెప్పారు. ఇక హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో కూడా రాజమౌళి కొమరం భీముడో పాట గురించి ప్రస్తావించారు. ఆ పాటలో ఎన్టీఆర్ నటన తనను ఆశ్చర్య పరిచిందని ఎన్టీఆర్ నటనను ఊహించగలనని కానీ కొమరం భీముడూ పాటలో మాత్రమే ఎన్టీఆర్ నటన కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ షాక్ కి గురి చేసిందని చెప్పారు.

సినిమాలో చరణ్ తారక్ నటన సూపర్ అని నా కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందని. తారక్, చరణ్ లు తమ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పారు. ఇక తన తర్వాత సినిమాపై ఆర్ఆర్ఆర్ ప్రభావం ఉండదని రాజమౌళి స్పష్టం చేశారు సినిమాకు వచ్చిన ప్రశంసల్ని తీసుకుంటామని జక్కన్న చెప్పుకొచ్చారు. 2 నెలల గ్యాప్ తీసుకుని మళ్లీ కొత్తగా పని ప్రారంభిస్తామని రాజమౌళి వెల్లడించారు. ఈ గ్యాప్ లో కుటుంబంతో కలిసి కూర్చుని ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో జరిగిన తప్పుల గురించి చర్చిస్తానని రాజమౌళి పేర్కొన్నారు. ఇక రాజమౌళి తన కుటుంబంతో కలిసి రెండూ వారాలు విహారయాత్రకు వెళ్తున్నారు. ఇక రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తో చేయబోతున్నారనే విషయం తెలిసిందే.



























