Rajamouli : ఈ మధ్య బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులే చూడటం మానేశారు, ఇక సౌత్ వాళ్ళు బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలను చూస్తారని ఆశ పెట్టుకోవడం పిచ్చితనమే అవుతుంది. కంటెంట్ బాగుంటే భాషతో సంబందం లేకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు కానీ ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్ సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. ‘దంగల్’ తెలుగు నాట మంచి విజయాన్ని అందుకుంది. కానీ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను ఆదరించలేదు పైగా సినిమాలో తెలుగు హీరో ఒక పాత్ర పోషించినా పెద్దగా పట్టించుకోలేదు మనవాళ్ళు. ఇక ఇపుడు బాలీవుడ్ లో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్రా’ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను సౌత్ లో కూడా విడుదల చేసి పాన్ ఇండియా సినిమా గా విడుదల చేస్తున్నారు. అందుకోసం ప్రమోషన్స్ ను కూడా బాగా ప్లాన్ చేసారు బ్రహ్మాస్త్రా టీం.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్…
ఇక సినిమా ప్రమోషన్స్ అంటే సౌత్ లో రాజమౌళిని మించి ఎవరు ప్లాన్ చేయరు. ఇపుడు బ్రహ్మాస్త్రా టీం కూడా రాజమౌళి మీదనే ఆధారపడింది. సౌత్ లో సినిమా ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి రాజమౌళి ద్వారా ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే ఇపుడు బ్రహ్మాస్త్రా టీం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రకటించడం తో ఒక్కసారిగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. రాజమౌళి కి ఎలా సినిమాను ప్రమోట్ చేయాలో బాగా తెలుసు అందుకే ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందో అతన్నే ఈవెంట్ కి ముఖ్య అతిధి గా తీసుకున్నాడు.

Gear up for a ????????????????-????????????????????????????????!????
— Karan Johar (@karanjohar) August 27, 2022
???????????? ???????? ???????????????????????? of Indian Cinema, @tarak9999 will be gracing the Biggest Pre-Release Event of ????????????????????ā???????????????? as the Chief Guest on ???????????????????????????????????? 2???????? in Hyderabad! #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/iO44lfptJK
ఇక నందమూరి అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. ఎన్టీఆర్ ను పిలవడం తో సినిమాను తెలుగు ప్రజలకు చేరువ చేసేసాడు జక్కన్న. ఇక మరో వైపు సినిమా ఎవరిదనేది ముఖ్యం కాదు, సినిమాలో కంటెంట్ ఉంటేనే రాజమౌళి ఆ సినిమా ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకుంటాడు లేదంటే అది ఎంత పెద్ద సినిమా అయినా పట్టించుకోడు అంటూ కామెంట్స్ కూడా నెటిజన్స్ నుండి వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికీ బ్రహ్మాస్త్రా ప్రమోషన్స్ కోసం రన్ బీర్ కపూర్ వైజగ్, హైదరాబాద్, అటు చెన్నై అన్ని తిరిగాడు. ఇక ఇపుడు హైదరాబాద్ లో బ్రహ్మాస్త్రా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా చేసి హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈసినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు.
































