Rajashekhar : తెలుగు సినిమా పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మాన్ గా గుర్తింపు పొందిన హీరో డాక్టర్ రాజశేఖర్. ఇపుడు సినిమాల జోరు తగ్గింది కానీ ఒకప్పుడు రాజశేఖర్ అంటే ఓ అంకుశం, ఆహుతి , అల్లరి ప్రియుడు, సింహారాశి,మా అన్నయ్య ఇలా ఎన్నో యాక్షన్ సినిమాలు ఆ తరువాత కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులు బాగా దగ్గరైన రాజశేఖర్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం సినిమాలు తగ్గించిన రాజశేఖర్, ఆ మధ్య గరుడ వేగా కల్కి సినిమాలతో అలరించారు.

కరోనా నుండి కోలుకున్నాక మళ్ళీ శేఖర్ సినిమాలో నటించారు. శేఖర్ సినిమా మలయాళం రీమేక్ సినిమా జోసెఫ్. ఇక ఈ సినిమాను జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఈ సినిమాలో నటించడం మరో విశేషం. ఇక ఈ సినిమాలు ఇటీవల విడుదలయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి పలు ఇంటర్వ్యూల్లో రాజశేఖర్ పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నాపై చాలా కుట్రలు చేసారు….
ఇక నేను వారికంటే ఎక్కువ ఎదిగితే కష్టమని భావించి తొక్కేయాలని కుట్రలు చేసి ఉండవచ్చు అని చెప్పారు. ఇక నా సినిమాల్లో నటించవద్దని హీరోయిన్స్ కి కూడా సూచించిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది డైరెక్టర్లను నా దగ్గరకి రానివ్వకుండా చేసుండవచ్చు అంటూ చెప్పారు. ఇక పవన్ గురించి కూడా కామెంట్స్ చేసారు. గబ్బర్ సింగ్ సినిమాలు చూసానని, గబ్బర్ సింగ్ లో పవన్ నన్ను ఇమిటేట్ చేయడం ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి అంటూ నా మీద ఉన్న కోపాన్ని అలా చూపించాడు అని వివరించారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో నేను మాట్లాడినదానికి నాపై పవన్ పగ తీర్చుకున్నారని చెప్పాడు. టాలెంట్ ను ఎల్లకాలం తొక్కలేరని చెప్పారు ఇక తాజాగా శేఖర్ సినిమా సినిమా ప్రదర్శన నిలిపివేసినందుకు కూడా రాజశేఖర్, నాపై కుట్రలు చేస్తున్నారంటూ స్పందించడం గమనార్హం.



























